ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుట్టా రేణుక ఆశలపై నీళ్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2019, 08:44 PM

తెలుగుదేశం పార్టీలో ఆశించిన టిక్కెట్ వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌క పోవ‌టంతో వైసీపీలోకి రీఎంట్రీ ఇచ్చిన బుట్టా రేణుక కర్నూలు ఎంపీ లేదా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తుంద‌ని భావించారు.  పార్టీ చేరిక స‌మ‌యంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్‌ కోసం బుట్టా రేణుక జగన్‌తో చర్చించినట్లు కూడా వ‌ర్త‌లొచ్చాయి. అయితే. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తనకే టికెట్‌ అంటూ ప్రచారం చేసుకుంటున్నందున‌ బుట్టా రేణుకకు ఎమ్మిగనూరు టికెట్ ఇచ్చే అవ‌కాశాలు లేవ‌ని మీడియాకు ఉప్పందించారు. పార్టీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ద‌మే అని జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది. అయితే  తాజాగా విడుద‌ల చేసిన అభ్యర్థుల జాబితాలో ఎమ్మిగనూరు టికెట్‌ చెన్నకేశవరెడ్డి లేదా జగన్‌మోహన్ రెడ్డి అంటూ ఇద్దరి పేర్లను జాబితాలో తెల్ప‌డంతో తాను పోటీ చేయడం లేదంటూనే   ఎమ్మిగనూరు సీటుపై ఆశలు పెట్టుకున్న  బుట్టా రేణుక  పై నీళ్లు చల్లినట్టయిందన్న‌ది క‌ర్నూలు జిల్లాలో వినిపిస్తోంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa