ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో శపథం చేసిన లగడపాటి రాజగోపాల్ తన మాటకు కట్టుబడి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. ఎన్నికల సర్వేలు చేపట్టి.. ఓటర్ల పల్స్‌ని విశ్లేషించడంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్. మరోసారి ఆంధ్రా ఎన్నికల్లో ఆయన కేంద్రబిందువు అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో ఆయన సర్వే ఫలితాలు తలకిందులైనప్పటికీ, ఏపీలో మరోసారి రాజగోపాల్ మకాం వేసి, పబ్లిక్ పల్స్‌ను పట్టుకుంటున్నారు. రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తున్నారు.
2014 ఎన్నికల తదుపరి ఆయన ల్యాంకో వ్యాపారాలపై దృష్టిసారించిన ఆయన. నష్టాల్లో నడుస్తున్న సంస్థలను గాడిలో పెట్టుకుంటున్నారు. పనిలో పనిగా తనకు అలవాటైన ఎన్నికల సర్వేలు కూడా చేపట్టారు. కర్నాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల ఫలితాలను కచ్చితంగా అంచనా వేసి చెప్పిన ఆయన. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం బోల్తా పడ్డారు. విమర్శలు వచ్చినా, తన పని తాను చేసుకునే లగడపాటి ప్రస్తుత ఎన్నికల తరుణంలో విజయవాడలో తిష్టవేసారు. అనుచరులు, పార్టీల నేతల ఇళ్లలోని శుభకార్యక్రమాలకు ఆయన వెళుతున్నారు. ఈ సమయంలో అనేక మంది అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. జనంనాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ సారి ఏ తరహా సర్వే ఫలితాలు వెల్లడిస్తారన్న ఆసక్తి అయితే సర్వత్రా మాత్రం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa