కేసీఆర్ కాళ్లు మొక్కే జగన్ కావాలా? చిన్నాన్నను చంపేసి ఆధారాలు లేకుండా చేసిన వ్యక్తి మనకు కావాలా? ’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. .విశాఖపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘మోసం చేయడంలో మోదీ, అమిత్ షా దిట్టలు. తెలంగాణ, మోదీ వల్ల ఆంధ్ర ప్రదేశ్‌కు అన్యాయం జరిగితే ప్రశ్నించాల్సిన విపక్ష నేత జగన్ వాళ్లతో కలిసి రాష్ట్రానికి మరింత అన్యాయం చేస్తున్నారు.ఈ మధ్యే మోదీ ఇక్కడే సభ పెట్టారు. తల, తోక లేకుండా విశాఖకు జోన్‌ఇచ్చారు. డివిజన్ విజయవాడలో ఉంది. ఇక్కడి డివిజన్ రాయగఢ్‌కు ఇచ్చారు. ఆదాయం లేని రైల్వే జోన్‌ను మనకు ఇచ్చారు. కేసీఆర్ తెలంగాణలో భారీ మెజారిటీతో గెలిచారు. అంతకంటే మిన్నగా పనిచేసిన ఈ ప్రభుత్వాన్ని ఎన్ని సీట్లతో గెలిపించాలి? మీలో కసి ఉంటే కేసీఆర్ బలపర్చిన జగన్‌కు ఓట్లేయొద్దు. కనీసం వైకాపాకు ప్రతిపక్షంలో ఉండే హోదా కూడా లేదు. ఈ సారి వైకాపాకు బోణీ కూడా ఉండదు. ఢిల్లీలో పార్లమెంటులో పోరాడలేక రాజీనామాలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడలేక రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రావడం లేదు. జీతాలు మాత్రం తీసుకుంటారు. ఇలాంటి వారు ప్రజా ప్రతినిధులుగా పనికిరారు. కేసీఆర్ విశాఖ వచ్చి పూజలు చేస్తుంటారు. ప్రతిపక్షాన్ని చిత్తుగా ఓడించి డిపాజిట్లు రాకుండా చేయడం మీ చేతుల్లోనే ఉంది. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినందుకు 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించారు. అలాగే భాజపాను కూడా ఓడించాలి. మనపై కక్ష సాధించేందుకు ముగ్గురు మోదీలు కలిశారు. మనలో ఉన్నది ఎన్టీఆర్ స్ఫూర్తి. ఆత్మగౌరవంతో బతకాలని ఎన్టీఆర్ పిలుపునిస్తే, ఆత్మ విశ్వాసంతో బతకాలని నేను చెప్తున్నా. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసేలా ప్రవర్తిస్తే వదులుతామా? వైకాపా దొంగిలించిన తెదేపా డేటాతో ఎవరైనా ఫోన్ చేస్తే గట్టిగా నిలదీయండి. ఇంకోసారి ఫోన్ చేయొద్దని హెచ్చరించండి. నేరస్థుల ఆట కట్టించే పోలీసులుగా మీరు తయారు కావాలి. 7 లక్షల మంది నేరస్థులను జైళ్లకు పంపాలి.’’ అని చంద్రబాబు అన్నారు.
‘‘నాదొకటే కులం పేదరికం. వేరే కులం నాకు తెలియదు. వారి కోసమే పని చేస్తా.’ ‘‘మిషన్ 150 ప్లస్‌కు శ్రీకారం చుట్టాం. 25 ఎంపీ స్థానాలు మనమే గెలవాలి. జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa