రాజమహేంద్రవరం లోక్‌సభ టీడీపీ అభ్యర్ధిగాసిటింగ్ ఎంపీ మురళీమోహన్ కోడలు మాగంటి రూప పేరు ఖరారైనట్టు వినిపిస్తోంది. మురళీ మోహన్ తరపున ఇక్కడి కార్యక్రమాలు చూస్తునే, గత కొంతకాలంగా ఆమె పార్లమెంటు పరిధిలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటు తనదైన శైలిలో నాయ కులకు, ప్రజలకు చేరువయ్యారు. మురళీ మోహన్ ఇటీవల తను ఎంపిగా పోటీ చేయనని, తన కుటుంబసభ్యులు కూడా రంగంలో ఉండరని ప్రకటించిన నేపథ్యంలో గుడా చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరామారావు ఎవరి ప్రయత్నాలు వారు ఆరంభించారు. ఈ క్రమంలో తాజాగా వస్తున్న వార్తలు పార్టీలో అసంతృప్తి రగిలించాయి. తెలుగుదేశం పార్టీ బుజ్జగించే ప్రయత్నాలు ఆరంభించినా ఓ కొలిక్కి రావట్లేందు. టిక్కెట్టు తనకు రాకుంటే బొడ్డుభాస్కర రామారావు తన అనుచరులతో కలసి పార్టీ మారే ఆలోచన చేస్తానని ఇప్పటికే హెచ్చరించారు. మాగంటి రూప పేరును ఖరారు చేయడానికి ముందే అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టినప్పటికీ అటు గన్ని వర్గం కూడా స్వతం్రత్య పోటీకి ఓ దశలో ఆలోచన చేసింది. కానీ ఆర్ధిక భారం దృష్టిలో ఉంచుకుని వెనకడుగు వేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా మరోవైపు తాజా మాజీ ఎమ్మెల్యే రాజమహేంద్రవరం లోక్‌సభ జనసేన అభ్యర్థిగా పోటీకి దిగుతున్న ఆకుల సత్యనారాయణ గన్ని వర్గం బిజెపిలోకి వచ్చి తనకు మద్దతుగా నిలవాలని గన్ని కృష్ణ సోదరుడు జీఎస్‌ఎల్ అధినేత గన్ని భాస్కరరావుతో మంతనాలు చేసినట్టు సమాచారం. మరి ఏం జరగనుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa