ఇంట్లో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలిని దుండగులు హత్య చేశారు. ఈ దారుణ ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో చోటు చేసుకుంది. బి.కె. పురంకు చెందిన రమణమ్మ (75) ఇంట్లో నిద్రిస్తుండగా.. దుండగులు చొరబడ్డారు. రమణమ్మను హత్య చేసి బీరువాలోని రూ.లక్ష, మెడలో ఉన్న 4 తులాల ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. రమణమ్మ హత్యకు గురైనట్లు తెలిసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa