పాకిస్థాన్ అండ చూసుకుని చెలరేగిపోతున్న ఉగ్రమూకలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత సైన్యం తొలి అడుగేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా అర్ధరాత్రి వేళ దాయాది దేశంలోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట నిర్వహించిన ఈ దాడులపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడాన్ని హర్షిస్తూ ఎక్స్ వేదికగా 54 సెకన్ల వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa