విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత పేరు గుర్తుందా.. పోలీసు శాఖలో పని చేస్తూ ఆమె చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. విశాఖపట్నంలో 2023 జులైలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు రూ.2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు కేసు నమోదైంది.. బాధితుల్లో ఒకరు నేవీ రిటైర్డ్ అధికారి కూడా ఉన్నారు. ఆ సమయంలో సీపీకి ఫిర్యాదు చేయడంతో.. విచారణ జరిపి స్వర్ణలతను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అప్పుడు స్వర్ణలత చేసిన ఘనకార్యాలు బయటపడ్డాయి. ఆమె సినిమాలపై ప్రేమతో సినిమా పాటలకు డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అక్కడితో ఆగకుండా పోలీసు అధికారిణి పాత్రలో ‘ఏపీ 31’ సినిమాలో నటించడమే కాదు నిర్మాణ వ్యవహారాల బాధ్యతలూ చూశారు. ఆ తర్వాత అరెస్టై జైలుకు వెళ్లారు.
జైలుకు వెళ్లొచ్చినా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా ఆమె చేసిన మరో ఘనకార్యం బయటపడింది. తాజాగా స్వర్ణలత, సుధాకర్ కలిసి విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు.. ఈ కేసులో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత పాత్ర బయటపడింది. ఆమెతో పాటు నకిలీ ఏసీబీ అధికారిగా నటించిన బలగ సుధాకర్ వ్యవహారం కలకలం రేపింది. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ చక్రపాణిని బెదిరించిన కేసులో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత అసలు సూత్రధారి అని తేల్చారు. ఆమెతో పాటు ఏసీబీ అధికారిగా నమ్మించిన బలగ సుధాకర్‌ను కూడా పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరినీ భీమిలి కోర్టులో హాజరుపరిచగా.. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. స్వర్ణలత ప్రస్తుతం బాపట్లలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. సెలవులో ఉండగా విశాఖపట్నంలో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సుధాకర్ బంధువులు ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఉద్యోగాల్లో ఉండటంతో, ఆయన ఏసీబీ అధికారిగా చలామణి అవుతున్నట్లు చెబుతున్నారు.
ఈ నెల 6న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి ఏసీబీ సీఐగా వెళ్లిన బలగ సుధాకర్.. 'త్వరలో ఏసీబీ రైడ్స్ ఉంటాయని.. అంతా మేం చూసుకుంటాం. మా ఎస్పీ మేడంతో మాట్లాడండి' అంటూ ఫోన్ సబ్ రిజిస్ట్రార్‌కు ఇచ్చారు. స్వర్ణలత ఏసీబీ అధికారిణిలా మాట్లాడుతూ.. 'సుధాకర్ చెప్పినట్లు చేయండి, అంతా మేం చూసుకుంటాం' అంటూ ఆదేశాలిచ్చారట. సుధాకర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినట్లు సీసీ ఫుటేజీలు ఉన్నాయి.. అక్కడి నుంచి మాట్లాడిన ఫోన్ నెంబరు స్వర్ణలతది అని ఆధారాలు లభించడంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.
స్వర్ణలతపై గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఏఆర్ హోంగార్డు ఎస్సైగా ఉన్నప్పటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత ఆమెను విజయవాడకు బదిలీ చేశారు. అక్కడ కొంతకాలం పనిచేసి శ్రీకాకుళం ఏఆర్‌కు వచ్చారు. జిల్లాల విభజన సమయంలో ఆమెను అనకాపల్లికి బదిలీ చేశారు. మళ్లీ విశాఖపట్నంలో ఖాళీ ఉండటంతో కొందరు నేతల సిఫార్సులతో ఆమె విశాఖపట్నం వచ్చారు. కొంతకాలం సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో పనిచేసి తర్వాత హోంగార్డుల రిజర్వు ఇన్‌స్పెక్టరుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె ఏపీ పోలీసుల సంఘం ఉపాధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతలపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో అయ్యన్నపాత్రుడుపై ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు.
స్వర్ణలత పోలీసు విశాఖపట్నంలో రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో 2023 జులైలో రూ.2 వేల నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి లక్షల్లో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. బాధితుల్లో ఒకరు నావికాదళంలో పనిచేసి రిటైర్ అయిన అధికారి కావడంతో నేరుగా సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణలో స్వర్ణలత పాత్ర ఉందని తేలడంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఇప్పుడు మధురవాడ సబ్ రిజిస్టార్ చక్రపాణిని బెదిరించిన కేసులో కూడా ఆమె పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. స్వర్ణలతకు సినిమాలపై కూడా ఆసక్తి ఉంది. ఆమె ఒక పాటకు డ్యాన్స్ చేసి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విశాఖకు రిజర్వు ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన తర్వాత సినీ రంగంతో సంబంధం ఉన్న ఓ నేతతో పరిచయాలు పెంచుకున్నారు. ఆ నేత ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పడంతో ఆమె డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆమె ఏకంగా కొరియోగ్రాఫర్‌ను నియమించుకుని సాధన చేశారు. ఆ తర్వాత ఆమె ‘ఏపీ 31’ అనే సినిమాలో పోలీసు అధికారి పాత్రలో నటించారు. అంతేకాకుండా ఆ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా చూసుకున్నారు. ఇప్పుడు మళ్లీ కేసులో ఇరుక్కున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa