భారత్- పాకిస్థాన్ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేసే విషయంలో పరస్పర అవగాహనకు వచ్చాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ పలు భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించగా, భారత్ కూడా సమర్థంగా తిప్పికొట్టింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అంతమొందించి తీరుతుందని తెలిపారు. ఈనెల 12వ తేదీన భారత్ - పాక్ మధ్య ప్రత్యక్ష చర్యలు ఉంటాయని.. ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణపై ఇరు దేశాలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. ముందుగా కాల్పుల విరమణకు పాకిస్తాన్ డీజీఎంవో ప్రతిపాదించారని.. ఆ తర్వాత చర్చలకు తాము అంగీకరించామని తెలిపారు. మరో అంశంపై కానీ, మరో ప్రదేశంలో కానీ చర్చించాలన్న నిర్ణయాలేమీ లేవని అన్నారు. అంతకుముందు భారత్- పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో శనివారం సాయంత్రం ఓ పోస్ట్ పెట్టారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీరించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa