భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని వెల్లడించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్, "భారత్- పాకిస్థాన్ నాయకత్వాలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై ఓ నిర్ణయం తీసుకున్నందుకు భారత్-పాక్‌కు థ్యాంక్యూ.. అలాగే కంగ్రాట్స్" అంటూ రాసుకొచ్చారు.భారత్, పాకిస్థాన్ కాల్పులను విరమించాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇరుపక్షాల సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే 12 మధ్యాహ్నం భారత్, పాక్ చెందిన అధికారులు మరోసారి చర్చలు జరుపుతారని వెల్లడించారు. కాల్పులు, అన్ని రకాల మిలిటరీ చర్యలు, ఎయిర్‌ఫోర్స్ చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa