స్టాక్ మార్కెట్లో ఎక్కువగా ప్రభావం చూపే అంశాల్లో విదేశీ పెట్టుబడులు ఉంటాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఎక్కువగా అమ్మకాలు చేపట్టినప్పుడు మార్కెట్లు పడిపోతుంటాయి. ఎక్కువగా ఇన్వెస్ట్ చేసినప్పుడు పెరుగుతుండడం గమనించవచ్చు. అయితే గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, కొన్ని పెన్నీ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ పెన్నీస్టాక్స్ పై వారికి ఉన్న విశ్వాసం, నమ్మకాన్ని ఈ పెట్టుబడులే తెలియజేస్తున్నాయి. అలాగే ఈ స్టాక్స్ రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం విదేశీయులు అధికంగా కొనుగోలు చేసిన టాప్- 5 పెన్నీ స్టాక్స్ సంబంధించిన పూర్తి వివరాలని ఇక్కడ మనం తెలుసుకుందాం.
నావిగెంట్ కార్పొరేట్ అడ్వైజర్స్ లిమిటెడ్
మార్చి త్రైమాసికంలో నావిగెంట్ కార్పొరేట్ అడ్వైజర్స్ లిమిటెడ్‌లో విదేశీ పెట్టుబడిదారులు 1.1 శాతం వాటాని కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేర్ ధర 0.5 శాతం లాభంతో రూ. 55.67 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 18 కోట్ల వద్ద ఉంది. గత ఏడాదిలో ఈ పెన్నీ స్టాక్ 46 శాతం మేర లాభాలు అందించింది.
జెన్సాల్ ఇంజనీరింగ్ లిమిటెడ్
మార్చి త్రైమాసికంలో జెన్సాల్ ఇంజనీరింగ్ కంపెనీలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు 4.88 శాతం వాటా కొనుగోలు చేశారు. చివరి ట్రేడింగ్లో ఈ కంపెనీ షేర్ 5 శాతం నష్టపోయింది. చివరకు రూ. 56.79 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 218 కోట్లుగా ఉంది.
సర్వీస్ కేర్ లిమిటెడ్
2025 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సర్వీస్ కేర్ లిమిటెడ్ కంపెనీలో 1.05 శాతం వాటా కొన్నారు విదేశీ సంస్థాగత మదుపరులు. DIIలు ఈ కంపెనీలో 0.39 శాతం వాటా కలిగి ఉన్నారు. చివరి ట్రేడింగ్లో 0.01 శాతం నష్టపోయిన షేరు ధర రూ. 58 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 77 కోట్ల వద్ద ఉంది.
శివమ్ ఆటోటెక్ లిమిటెడ్
మార్చి త్రైమాసికంలో శివమ్ ఆటోటెక్ లిమిటెడ్ కంపెనీలో FIIలు 0.04 శాతం వాటా కొన్నారు. DIIలు ఈ కంపెనీలో 7.06 శాతం వాటా కలిగి ఉన్నారు. చివరి ట్రేడింగ్ సెషన్లో ఈ కంపెనీ షేరు 3.4 శాతం నష్టంతో రూ. 26.54 వద్ద స్థిరపడింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 323 కోట్ల వద్ద ఉంది.
నెక్టార్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్
2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నెక్టార్ లైఫ్ సైన్సెస్ కంపెనీలో విదేశీయులు (FII) 0.73 శాతం వాటా కొనుగోలు చేశారు. DIIలు మార్చి 2025 చివరి నాటికి 0.15 శాతం వాటా కలిగి ఉన్నారు. చివరి ట్రేడింగ్లో ఈ షేర్ ధర 1 శాతం నష్టపోయింది. చివరకు రూ. 20.85 వద్ద ముగిసింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 460 కోట్ల వద్ద ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa