ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ ఒక్కటి మాత్రమే మారలే.. జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన

national |  Suryaa Desk  | Published : Mon, May 12, 2025, 07:56 PM

పహల్గామ్‌ దాడితో కశ్మీర్‌లో ఏళ్ల తరబడి జరిిన ఆర్థిక, దౌత్య పరమైన అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్లిందని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్డుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత కోలుకుంటోన్న పర్యాటక రంగానికి ఇది గట్టి ఎదురుదెబ్బ అని, అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ మళ్లీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించుకునే అవకాశాన్ని ఈ దాడి కల్పించిందని ఆయన చెప్పారు. ‘మేము ఊహించని స్థితిలో ఉన్నాం... రక్తపాతం, బాధ, ఆందోళన, మార్పు, క్షోభ... అన్నీ జరిగాయి. అయితే కొంత వరకూ ఏమీ మారలేదు కూడా అని’ ఆయన వాపోయారు.


ఈ మార్పు ఎలా కనిపిస్తోంది అన్న ప్రశ్నకు ఒమర్ అబ్దుల్లా బుదలిస్తూ... ‘ఈ సీజన్‌లో పర్యాటకులతో కిటకిటలాడే కశ్మీర్ కనిపించాలి. ఆర్థిక రంగం ఊపుమీద ఉండాలి. పిల్లలు పాఠశాలల్లో ఉండాలి. విమానాశ్రయం రోజుకు 50-60 విమానాలతో నడుస్తూ ఉండాలి... కానీ ప్రస్తుతం ఖాళీగా మారిపోయినకాశ్మీర్ లోయలో, పాఠశాలలు మూతబడ్డాయి, విమానాశ్రయం, గగనతలం మూతబడ్డాయి’ అని పేర్కొన్నారు.


ఏమీ మారలేదంటే.. మరోసారి దురదృష్టవశాత్తూ జమ్మూ కశ్మీర్ సమస్యను అంతర్జాతీ వేదికలపై చర్చించే అవకాశం పాకిస్థాన్‌కు కల్పించింది..... అమెరికా కూడా మధ్యవర్తిగా తలదూర్చాలని ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. కశ్మీర్ వివాదంపై మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆఫర్ చేసిన నేపథ్యంలో ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఇంతవరకు భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణలో ఏవైనా సమస్యలున్నా ప్రస్తుత పరిణామాలతో పూర్తిగా మారిపోయింది.. ఈ రాత్రి ఏం జరుగుతుందో మేము ఎదురు చూస్తున్నాం’ అని తెలిపారు.


‘మూడు వారాల కిందట పర్యాటకులతో కళకలలాడిన బైసరన్ లోయ.. భయానకమైన హత్యాకాండ తర్వాత నిర్మానుష్యంగా మారిపోయింది’ అని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఏప్రిల్ 22న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై దాడిచేసిన ఉగ్రవాదులు... మతం పేరుతో మారణహోమానికి తెగబడ్డారు. మొత్తం 26 మంది అమాయకులను కాల్చి చంపారు. దీనికి ప్రతీకారంగా భారత్ మే 7న ‘ఆపరేషన్ సింధూర్’పేరుతో సైనిక ఆపరేషన్ చేపట్టి... పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు జరిపింది.


దీనికి ప్రతిగా ఆ మర్నాడే పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దాయాదికి భారత్ గట్టిగానే బుద్దిచెప్పింది. పాక్ వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు, సైనిక మౌలిక వసతులు, వాయుసేన రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడిచేసి వాటిని ధ్వంసం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa