ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతన్నకు అండగా ఉంటాం : జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 19, 2019, 01:05 PM

రాష్ట్రంలో లంచం లేనిదే ఏపనీ జరగడం లేదని, మన ప్రభుత్వం రాగానే లంచాలు లేని సంక్షేమ పాలన అందిస్తానని వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కొయ్యలగూడెంలో జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. జన్మభూమి కమిటీల పేరుతో ప్రతి గ్రామంలో మాఫియాను తీసుకొచ్చారన్నారు. బర్త్ సర్టిఫికెట్ కు లంచం… డెత్ సర్టిఫికెట్ కు లంచం ఇవ్వాల్సిందేనన్నారు. డ్వాక్రా, పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేయకుండానే చేశామని చెప్పుకున్నారని జగన్ అన్నారు. ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటామని అన్నారు. ఉచిత బోర్లు వేయిస్తామన్నారు. 9గంటల ఉచిత కరెంట్  ఇస్తానన్నారు. రాష్ట్రంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా, ఏపని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందేనన్నారు. పొదుపు సంఘాలకు చెల్లించాల్సిన బాకీలను ఎగ్గొట్టారన్నారు. మోసం చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటిరారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబు ప్రజలు గుర్తొస్తారన్నారు. ఇప్పుడు మోసం చేసింది చాలదన్నట్లు మరోసారి మోసం చేయాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa