ఆపరేషన్ సిందూర్ తరువాత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం కోసం కేంద్రం రక్షణ బడ్జెట్ పెంపును పరిశీలిస్తోంది. రక్షణ బలగాలకు నూతన ఆయుధాలు, సాంకేతిక పరికరాల కొనుగోలుకు రూ.50,000 కోట్ల అదనపు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఈ కేటాయింపును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించే అవకాశం ఉంది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఇప్పటికే రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లను రక్షణ రంగానికి కేటాయించింది.గత పదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రక్షణ బడ్జెట్ దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2014-15లో రూ.2.29 లక్షల కోట్లుగా ఉన్న రక్షణ బడ్జెట్ ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 6.81 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53 శాతం అధికం కావడం గమనార్హం. ప్రస్తుత కేటాయింపులు మొత్తం కేంద్ర బడ్జెట్‌లో 13.45 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa