మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలుచేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన నుంచి వాంగ్మూలం తీసుకోవడానికి అనుమతివ్వాలని ఈడీ తరఫు న్యాయవాది జయప్రకాశ్ గురువారం ఈ పిటిషన్ వేయగా.. సాంకేతిక కారణాలతో న్యాయాధికారి పి.భాస్కరరావు తిరస్కరించారు. దీంతో శుక్రవారం ఉదయం మళ్లీ వ్యాజ్యం దాఖలు చేశారు. పరిశీలించిన న్యాయాధికారి రాజశేఖర్‌రెడ్డికి నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. విచారణను సోమవారానికి వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa