కొత్తచెరువు మండల కేంద్రంలో శనివారం ప్రత్యేక అవసరాల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆడిషన్ కార్యక్రమాన్ని ప్రాజెక్టు కోఆర్డినేటర్ దేవరాజ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన అనేక కుటుంబాలను కలిసి పిల్లల ఆరోగ్య స్థితిగతుల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా సాయి ఈశ్వర్ కుమార్తె ఈశా గురించి ఆమె తల్లిదండ్రులను దేవరాజ్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. గర్భధారణ సమయంలో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా అని అడిగిన ప్రశ్నకు, ఈశా తల్లి స్పందిస్తూ – “ఆ సమయంలో నాకు జ్వరం వచ్చింది. ఆ ప్రభావంతో ఆహారాన్ని సరిగా తీసుకోలేకపోయాను” అని తెలిపారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు సరైన సహాయం అందించేందుకు ఈ ఆడిషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లల ఆరోగ్య పరిస్థితులపై అవగాహన పెంచుతూ, అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa