నగరి నియోజకవర్గంలో నగరి, నింద్ర, విజయాపురం, పుత్తూరు, వడమాలపేట అయిదు మండలాలు ఉన్నాయి. నగరి మండలంలోని వెలవడి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రోజాకు నిరసనల సెగ తగిలింది. డ్వాక్రా మహిళల పొదుపు సంఘం వారిని కలిసేందుకు ఆమె వెళ్లినప్పుడు లోకల్ మహిళల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. “2014లో మీకు ఓటేస్తే మీరు ఏం చేశారు మాకు? ఏమ్మా గుర్తున్నామా మేము? ఆ పొద్దు ఎప్పుడో ప్రచారానికి వచ్చినప్పుడు చూపినారు మీ మొఖం. మరల వచ్చినారా ఇటుకేసి ఏమైనా? టీవీల్లో చూసుకోవటమే మా ఎమ్మెల్యేని, ఊర్లో కనిపించేది లే!” అంటూ నిష్ఠూరం ఆడారు. “అయినా మా పిచ్చి గాని మీ పార్టీకి ఓటేసినా మళ్లా మీరు అసెంబ్లీకి ఎళతారా ఏంది? అసెంబ్లీకి పోనే పోక పోతివాయే. ఎందుకేయాల ఓటు? మళ్లీ ఆ పిల్లోడు సీఎం అవకుంటే అసెంబ్లీకి పోనే పోడు, మిమ్మల్ని పోనీయడు. ఎందుకు చెప్పు రోజమ్మా మీకు ఓటు” అంటూ ఒకేసారి విరుచుకు పడ్డారు. మీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో నాకు తెలుసులే అని రోజా ఆగ్రహంగా అక్కడి నుంచి నిష్క్రమించారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa