ఇటీవలే బీజేపీ పార్టీలో చేరిన టీంఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సతీమణి రివాభా జడేజా త్వరలో ప్రత్యక్ష రాజకీయల్లోకి రానున్నారు. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీచేయనున్నారు. ఆమె గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి సీటు ఆశిస్తున్నారు. కాగా ఇదే నియోజకవర్గం నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పటిదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్‌ని బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీనితో అందరి దృష్టి ఈ నియోజకవర్గం పైనే ఉంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించింది. గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా బలమైన నాయకులను బరిలోకి దింపి 2014 ఫలితాలను పునరావృతం చేయాలని గుజరాత్ బీజేపీ భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa