ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర తక్కువ, సిటీ సెంటర్..,,,,ఆ ఇళ్లనే ఎక్కువ కొంటున్నరు

business |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 11:37 PM

సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది జీవితంలో ఒక గొప్ప క్షణం. తమకంటూ ఓ సొంత ఇల్లు ఉండాలనుకుంటారు. అయితే, ప్రస్తుత రోజుల్లో ఇల్లు కొనుగోలు చేయడం అంటే లక్షల రూపాయలు అవసరమవుతున్నాయి. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు స్థిరంగానే ఉన్నాయి. రిజిస్ట్రేషన్లలో వృద్ధి స్థిరంగా కొనసాగుతోంది. 5 సంవత్సరాల క్రితం పోలిస్తే 77 శాతం పెరుగుదల నమోదైంది. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని కీలక నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబై, నవీ ముంబై, నోయిడా, పుణె, థానే నగరాల్లో చూస్తే రిజిస్ట్రేషన్ల ట్రాన్సాక్షన్లు 3.07 లక్షలు జరిగాయి. అదే 2024-25 ఏడాదికి వస్తే రిజిస్ట్రేషన్లు 5.44 లక్షలకు పెరిగాయి.


ఆయా నగరాల్లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ ఇళ్ల అమ్మకాలపై స్క్వేర్ యార్డ్స్ సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇందులో నేరుగా బిల్డర్ల నుంచి కొనుగోలు చేసిన ఇళ్లు అంటే ప్రైమరీ మార్కెట్ వాటా 57 శాతంగా ఉంది. అలాగే రీసేల్ ఇళ్లు అంటే సెకండ్ హ్యాండ్ ఇళ్ల అమ్మకాల జరిగిన లావాదేవీలు (సెకండరీ మార్కెట్) వాటా 43 శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.


వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ఇళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, సిటీ నడిబొడ్డున ఇల్లు కావాలంటే అంత సులభం కాదు. కొత్త వాటికి అయితే కోట్లలో వెచ్చించాల్సి వస్తుంది. దీంతో చాలా మంది పాత ఇళ్ల కోసం చూస్తున్నారు. కొత్త వాటికి బదులుగా పాత ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో సిటీలో ప్రైమరీ మార్కెట్ వాటా 49 శాతం ఉంటే సెకండరీ మార్కెట్ వాటా 51 శాతంగా నమోదవడమే ఇందుకు నిదర్శనం. మొత్తంగా 70 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2019తో పోలిస్తే ట్రాన్సాక్షన్లలో 11 శాతం పెరుగుదల కనిపించింది. కొత్త ఇళ్ల ట్రాన్సాక్షన్లు, పాత ఇళ్ల కొనుగోళ్లు పోటాపోటీగా ఉన్నట్లు స్క్వేర్ యార్డ్స్ నివేదిక చెబుతోంది. ఒకింత రీసేల్ ట్రాన్సాక్షన్లే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com