అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు అత్యంత తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆయన కార్యాలయం ఆదివారం ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఈ వార్త అమెరికా రాజకీయ వర్గాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.గత వారం నుంచి మూత్ర సంబంధిత సమస్యలు ఎక్కువ కావడంతో పాటు, ప్రోస్టేట్ గ్రంథిలో ఒక కణితిని గుర్తించిన వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల అనంతరం గత శుక్రవారం జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు తేలిందని ఆయన కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. వ్యాధి తీవ్రతను సూచించే గ్లీసన్ స్కోర్ 9 (గ్రేడ్ గ్రూప్ 5) గా ఉందని, క్యాన్సర్ కణాలు ఎముకలకు కూడా విస్తరించాయని (మెటాస్టాసిస్) ప్రకటనలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa