బెంగళూరులోని సిద్దేదహల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ మహిళ ఓ బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. అయితే మద్యంకు డబ్బు కావాలని భర్త కోరగా.. మొదట నిరాకరించినా తర్వాత ఇచ్చింది. అతడు ఫుల్‌గా తాగి ఫోన్‌లో పాటలు వింటుండగా.. సౌండ్ తగ్గించమని భార్య కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతడు బాత్రూంలో ఉన్న యాసిడ్ తెచ్చి ఆమెపై పోశాడు. మహిళకు తీవ్ర గాయాలయైగాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa