ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్: ఇంటి కింద 45 పాములు

international |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 05:02 PM

ఒక్క పామును చూస్తేనే మన ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. అలాంటిది పదుల సంఖ్యలో పాములు ఒక్కచోట ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అల్బానీలో ఉండే ఓ ఇంటి యజమానికి ఇదే అనుభవం ఎదురైంది. తన ఇంటి కింద ఓ కేబుల్ కోసం వెతికిన అతనికి పదుల సంఖ్యలో రాటిల్ స్నేక్స్ కనిపించాయి. వాటిని చూసి ఆందోళన చెందిన అతడు వెంటనే బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్‌కు ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చి చూస్తే.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 రాటిల్ స్నేక్స్ అక్కడ కనిపించాయి. వాటిని ఒక్కొక్కొటిగా బయటకు తీసి.. చివరికి అన్నింటినీ సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ఇప్పటికే 11 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. రాటిల్ స్నేక్ ఎంతో ప్రమాదకరమైన పాము జాతి. గతంలో ఇదే టెక్సాస్ రాష్ట్రంలో మరో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన షెడ్‌లో అతను ఏకంగా 30 రాటెల్ స్నేక్స్ కనిపించాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa