ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుల్వామా దాడి మోదీ పనే : రామ్‌గోపాల్ యాదవ్

national |   | Published : Thu, Mar 21, 2019, 05:19 PM

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ గురువారం దారుణమైన వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిని ఓట్ల కోసం మోదీయే చేయించారని ఆయన విమర్శించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సర్కార్ భద్రతా బలగాలను చంపించిందని  రామ్‌గోపాల్ యాదవ్ ఆరోపించారు. మోదీపై పారా మిలిటరీ బలగాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయని రాంగోపాల్ యాదవ్ చెప్పారు. పుల్వామా దాడి ఓ కుట్ర. జమ్ము-శ్రీనగర్ మధ్య అసలు ఎలాంటి తనిఖీలు చేయలేదు. జవాన్లను సాధారణ బస్సుల్లో పంపించారు అని ఆయన ఆరోపించారు. ఈ ఘటనపై తాను ఇంతకన్నా ఎక్కువగా ఏమీ మాట్లాడనని, ప్రభుత్వం మారితే దీనిపై విచారణ జరుపుతారని, అప్పుడు పెద్ద పెద్ద వాళ్లు ఇరుక్కుంటారని రాంగోపాల్ యాదవ్ అనడం విశేషం.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa