తూర్పుగోదావరి జిల్లాలో జనసేనకు షాక్ తగిలింది. ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త సాయికుమార్ యాదవ్ జనసేనకు రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసినట్లు తెలుసుకున్న టీడీపీ నేతలు పార్టీలో చేరాలని మంతానాలు జరిపారు. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి వరపుల రాజా సమక్షంలో సాయికుమార్ కండువా కప్పుకున్నారు. గురువారం ఉదయం రెండు వేల మంది అనుచరులు, కార్యకర్తలతో సాయికుమార్ టీడీపీ కండువా కప్పుకున్నారు.ఆయన ప్రత్తిపాడు టికెట్ ఆశించగా.. పవన్ టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి-23న జనసేన నేత నాదెండ్ల మనోహర్ సమక్షంలో సాయికుమార్ ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే పలువురు జనసేన నేతలు టికెట్లు దక్కకపోవడంతో జంపింగ్‌లు చేసిన విషయం విదితమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa