ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి చూసి ఓట్లేయండి : మ‌ంత్రి నారాయ‌ణ‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 21, 2019, 06:25 PM

నెల్లూరు నగరాభివృద్దిని చూసి సైకిల్ గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని మంత్రి నారాయణ అన్నారు. గురువారంనాడు స్థానిక 3 వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నగరంలో వేసిన రోడ్లు, నిర్మించిన పార్కులు, నెక్లెస్ రోడ్డు వంటి అభివృద్ధి పనులు చూసి తిరిగి టీడీపీ ప్రభుత్వం వచ్చేలా ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి చేశాను కాబట్టే తాను ఓటు అడుగుతున్నానని ఈ సంధర్బంగా మంత్రి అన్నారు. తన పర్యటనలో ప్రజల్లో సంతోషాన్ని చూస్తున్నానని నగరాభివృద్ది జరుగుతున్న తీరు వల్లే ఇది సాధ్యమయిందని అన్నారు. నగరంలో జరుగుతున్న మిగిలిన పనులన్నీ ఏప్రిల్ నెలాఖరుకి పూర్తవుతాయని అన్నారు. నగరాన్ని స్మార్ట్ సిటీగా చేసేందుకు ప్రజలు తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు. రాష్ట్రాభివృద్ధి మరింతగా జరగాలంటే టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ ఆలోచించి ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని మంత్రి కోరారు. పర్యటనలో భాగంగా డివిజన్ లోని అన్ని ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. ప్రజలు హారతులు పట్టి మంత్రికి స్వాగతం పలికారు. పర్యటనలో మంత్రితో పాటు నగర టీడీపీ ఇంచార్జి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ పొత్తూరు శైలజ, 4వ డివిజన్ కార్పొరేటర్ మామిడాల మధు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa