హోలీ సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ హోలీ త్రోబ్యాక్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరవింద్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నప్పుడు హోలీ వేడుకల్లో పాల్గొన్న సమయంలో తీసిన ఫోటో అది. తన బ్యాచ్‌మెట్ రాజీవ్ సరఫ్ హోలీ సందర్భంగా ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా నెటిజన్లు ఈ హోలీ వేడుకల్లో సీఎం ఎక్కడున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపించడంతో..బ్రౌన్ కలర్ ప్యాంట్ వేసుకొని ముందు నడుస్తున్న వ్యక్తినే నేను.. అంటూ అరవింద్ కేజ్రివాల్ రిప్లయి ఇచ్చారు. ఇక.. ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ అయిందో లేదో నెటిజన్లు ఆ ఫోటోను తెగ వైరల్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa