మాటకు (పదాలకు) అద్భుతమైన శక్తి ఉంటుంది. పదాలను నైపుణ్యంగా ఒక క్రమ పద్ధతిలో పేర్చితే ప్రజల మనసులో ఈ పని చేయాలి అని చెప్పే బటన్ నొక్కే ఒక తాళం చెవిగా పని చేస్తాయి. ఇది తెలియకుండానే ఒక విషయాన్ని ఒప్పించే కళ. సోషల్ మీడియా ప్రకటనల నుంచి దుకాణాలలో వ్యూహాత్మక సంకేతాల వరకు ప్రజలు తమకు తెలియకుండానే ప్రకటనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా చేసే మంత్రం. ఒక మాట, పదాల అమరికకు ఉన్న శక్తిని ఎన్నో సందర్భాల్లో మీరు గమనించే ఉంటారు. ఏదైనా ప్రకటన చదివి అక్కడే ఆగిపోయిన సందర్భాలు మీరూ అనుభవించే ఉంటారు. అలా మాటల శక్తితో ఓ వ్యక్తి చట్టబద్ధంగా ఎలా స్కామ్ చేశాడో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
ఓ వ్యక్తి మాటల శక్తితో వేలాది మందిని మోసం చేసిన ఉదంతం ఇది. 1990లలో స్టీవ్ కొమిసర్ అనే వ్యక్తి సోలార్ ఎనర్జీ పేరుతో ప్రజలను మోసం చేశాడు. తక్కువ ధరకే సోలార్ పవర్డ్ క్లాత్స్ డ్రయర్ (సౌర విద్యుత్తుతో నడిచే దుస్తులు ఎండబెట్టుకునే సాధనం) ఇస్తానని చెప్పి, సాధారణ తాడును పంపించి మోసం చేశాడు. అయితే, అతను చెప్పిన మాటల్లో (పదాలు) నిజాయితీ ఉండటంతో అతనిపై ఎవరూ దావా వేయలేకపోయారు. అంటే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకోలేకపోయారు.
'సోలార్ పవర్డ్ క్లాత్స్ డ్రయర్ ' కేవలం 49.95 డాలర్లు మాత్రమే అని కొమిసర్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఆ సమయంలో సోలార్ వస్తువులకు మంచి ఆదరణ ఉండేది. ఈ సోలార్ అనే పదాన్ని తదనైన శైలీలో ఉపయోగించుకున్న కొమిసర్ వేలాది మందిని ఈజీగా మోసగించగలిగాడు. అతను సోలార్ పవర్డ్ క్లాత్స్ డ్రయర్ అని ప్రకటన చేయగానే.. అమెరికాలోని చాలా మంది ప్రజలు సోలార్ ఎనర్జీకి ఆకర్షితులై అతని ప్రకటనను నమ్మారు. డబ్బులు పంపి ఆ వస్తువు కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే, తమకు వచ్చిన పార్శిల్ చూసి ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఎందుకంటే అందులో ఉన్నది అది సాధారణ బట్టలు ఆరవేసే తాడు. మోసపోయామని గుర్తించిన చాలా మంది కొమిసర్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు.
అయితే, అతను చెప్పిన సమాధానం విని వారి నోట మాట కూడా రాలేదు. "పంపించిన వస్తువు ఒక నిజమైన డ్రైయింగ్ పరికరం, ఇది సౌర శక్తితో పని చేస్తుంది!" అని కొమిసర్ సమాధానం ఇచ్చాడు. అంటే, ‘ఎండలో బట్టలు ఆరబెట్టుకునేందుకు ఉపయోగపడే సాధనం (తాడు)’ అని దీని అర్థం. దీంతో తామే సరిగా అర్థం చేసుకోలేకపోయామని, మోసపోయినట్లు గ్రహించారు. అతను చెప్పింది నిజమే, ప్రకటనలో నిజాయితీ ఉండటంతో అతనిపై ఎవరూ దావా వేయలేకపోయారు. "మోసపూరిత" చిత్రాన్ని సృష్టించేందుకు అతను పదాలను మాత్రమే ఉపయోగించాడు.
స్టీవ్ కొమిసర్ ఒక తెలివైన వ్యక్తి. మార్కెట్ ట్రెండ్‌ను ఉపయోగించుకున్నాడు. ప్రజల మనస్సుల్లో ఒక భ్రమను సృష్టించాడు. ఇలా ప్రకటన చేసి వచ్చిన డబ్బులు లెక్కిస్తూ తనను తాను అభినందించుకున్నాడు. అతని తెలివితేటలకు ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. కానీ, మోసం ఎప్పుడూ మంచిది కాదు. ఈ విషయంలో అతను చట్టపరమైన చర్యలను తప్పించుకున్నప్పటికీ, ఇతర మోసాలకు పాల్పడినందుకు జైలుకు వెళ్ళాడు. ప్రజలను ఆకర్షించే సందేశాలను రూపొందించడంలో సహాయం కోసం నిపుణులను సంప్రదించడం ఉత్తమం. స్టీవ్ కొమిసర్ కథ ఒక ఉదాహరణ. మాటల శక్తిని ఉపయోగించి మోసం చేయకూడదు. నైతికంగా, నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అలాగే మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దు. ప్రజలు మోసపోకుండా ఉండటానికి అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. స్టీవ్ కొమిసర్ లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకారం. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తుంటారు. మోసపూరిత మార్గాలు ఎప్పుడూ పని చేయవు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి. మోసగాళ్ల బారిన పడకుండా కాపాడుకోవాలి. పదాల శక్తిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa