ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్రం కీలక ప్రకటన.. ఒక్కొక్క రైతు అకౌంట్లోకి రూ. 2 వేలు

business |  Suryaa Desk  | Published : Wed, May 28, 2025, 09:17 PM

 పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు ముఖ్యమైన అప్‌డేట్. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం, త్వరలో 20వ విడత డబ్బులు విడుదల చేయనుంది. అయితే, డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద.. చివరి విడత డబ్బులు (19వ విడత) ఫిబ్రవరిలో విడుదలయ్యాయి. తదుపరి 20వ విడత జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 6 వేలను మూడు విడతలుగా (ఒక్కో విడతకు రూ. 2000) రైతుల ఖాతాకు జమ చేస్తుంది. తదుపరి విడత విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నాలుగు నెలలకు ఒక విడత చొప్పున డబ్బులు వస్తుంటాయి.


లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా?


పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత వచ్చే ముందు, లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. దీని కోసం ఏం చేయాలంటే?


మొదట పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.in కు వెళ్లండి.


హోమ్ పేజీలో 'Farmers Corner' కు వెళ్లండి.


ఆ తర్వాత 'Beneficiary List' పై క్లిక్ చేయండి.


ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, సబ్- డిస్ట్రిక్ట్, బ్లాక్, గ్రామం వివరాలు వంటి మీ సమాచారాన్ని నమోదు చేయండి.


సమాచారం అంతా నింపిన తర్వాత, 'Get Report' పై క్లిక్ చేయండి.


పేమెంట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?


 


మొదట పీఎం కిసాన్ పోర్టల్ www.pmkisan.gov.in కు వెళ్లండి.


ఇప్పుడు 'Farmers Corner' కు వెళ్లి 'Know Your Status' పై క్లిక్ చేయండి.


ఆ తర్వాత, మీ రిజిస్ట్రేషన్ నంబర్, ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ వంటి మీ సమాచారాన్ని నమోదు చేయండి.


కాప్చా కోడ్‌ను నమోదు చేసిన తర్వాత, 'Get OTP' పై క్లిక్ చేయండి.


మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని నమోదు చేసిన తర్వాత, View Status పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ స్టేటస్ మీకు కనిపిస్తుంది.


ఈ 3 పనులు చేస్తేనే అకౌంట్లోకి డబ్బులు..


అర్హులైన ప్రతి ఒక్క రైతు పీఎం కిసాన్ బెనిఫిట్ కోల్పోకుండా ఉండాలంటే.. కొన్ని పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ముందుగా ఇ- కేవైసీ పూర్తి చేయాలి. ఇది తప్పనిసరి. రెండో పని.. మీ బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. చివరగా మూడోది మీ భూమి వివరాల్ని ధ్రువీకరించాలి. అయితే ఇందుకోసం సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌ను (CSC) సందర్శించండి. ఈ పనులన్నీ 2025, మే 31 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక విభాగం.. తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.


eKYC ఎలా చేయాలి?


రైతులు తమ మొబైల్ నుండి e-KYC చేసుకోవచ్చు, దీని కోసం మూడు సులభమైన పద్ధతులు ఇక్కడ ఉన్నాయి.


పీఎం-కిసాన్ మొబైల్ యాప్ ద్వారా: గూగుల్ ప్లే స్టోర్ నుండి PM-Kisan మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. ఆధార్ నంబర్, లబ్ధిదారుల ID ని నమోదు చేసి యాప్‌లోకి లాగిన్ అవ్వండి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ ద్వారా కేవైసీ చేయించుకోవచ్చు.


పోర్టల్ ద్వారా: పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 'ఇ-కేవైసీ' ఎంపికపై క్లిక్ చేయండి. మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేయండి.


కామన్ సర్వీస్ సెంటర్‌ల (CSC) ద్వారా: సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఇ-కేవైసీ చేయించుకోవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa