ప్రతి జిల్లాలోనూ ఒక సోలార్ రూఫ్‌టాప్ మోడల్ విలేజ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి డిస్కమ్‌లు, నెడ్‌క్యాప్ కలిపి మూడు లక్షల సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం డిస్కమ్‌ల సీఎండీలు, నెడ్‌క్యాప్ అధికారులతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ ఏడాది 20 లక్షల రూఫ్‌టాప్ సోలార్ కనెక్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని సీఎస్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa