ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. నిన్న జరిగిన హోరాహోరీ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ (ఎంఐ)ను చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగి అజేయ అర్ధశతకం (87)తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ విజయానందంలో ఉన్న కెప్టెన్ అయ్యర్‌కు స్లో ఓవర్ రేట్ రూపంలో భారీ జరిమానా పడింది. అటు ముంబయి సారథి హార్దిక్ పాండ్యకు కూడా ఇదే కారణంతో బీసీసీఐ ఫైన్ వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa