ప్రతి ఏడాది మార్చి23న జరిపే నేషనల్ డే వేడుకలను ఈసారి ఒకరోజు ముందుగానే జరుపుకుంటోంది పొరుగు దేశమైన పాకిస్థాన్. ఎన్నో ఏళ్లగా ఆనవాయితీగా మన దేశం తరఫున ఒక కేంద్ర మంత్రి ఒకరు ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతు వస్తున్నారు. పుల్వామా ఉగ్ర దాడి తరవాత ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిని, రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ అధికారులను పాక్ భద్రతా సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు వెలుగులోకి చూసాయి. ఈవిషయమై మార్చి 18న పాక్ విదేశాంగ శాఖకు భారత్ నివేదిస్తూ, తక్షణ విచారణ కోరినా చర్యలు లేకపోవటంపై భారత్ ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. పైగా ఈ కార్యక్రమానికి కశ్మీర్ వేర్పాటువాద నేతలను ఆహ్వానించడం వల్లే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa