ఎన్నికల ప్రచారం నుంచి అకస్మాత్తుగా కనిపించకుండాపోయి వైఎస్ జగన్‌కు ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి షాకిచ్చారు. .టికెట్ రాకపోవడంతో మనస్తాపంతో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని . బయటకు ఇలా చెబుతున్నప్పటికీ టికెట్ దక్కలేదన్న అసంతృప్తితోనే వైవీ ఒంగోలులో ప్రచారానికి దూరంగా ఉన్నట్లు పార్టీ వర్గాలోనే గుసగుస వినవస్తోంది. జగన్ తనకు టికెట్ కేటాయించకపోవడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి కారణమని వైవీ భావిస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం. కానీ తను తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ గెలుపు బాధ్యతలు తీసుకున్నందునే జగన్ ప్రచార సభలో పాల్గొనలేదంటున్నారు సుబ్బారెడ్డి. అయితే వైవి మాగుంటని ఓడించే పథకాన్ని ఇప్పటికే అనుచరులకు తెలిపారని ఆమేరకు వారు నడుస్తారని వినవస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa