శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు గాను జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రి 10 గంటల తర్వాత జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ తనిఖీలు ఏకకాలంలో ప్రారంభమయ్యాయి.
పోలీసు అధికారులు లాడ్జీలు, వాహనాలు, రైల్వే స్టేషన్లు, టోల్ ప్లాజాలు వంటి కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సీఐలు, ఎస్సైలు ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపై దృష్టి సారించారు.
విదేశీ వ్యక్తులు అక్రమంగా ఉన్నట్లు అనుమానం ఉన్నచో, వారు కనిపిస్తే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా చేపట్టినవని, పోలీసులు నిత్యం నిఘా కొనసాగిస్తారని అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa