పల్నాడు జిల్లాలో 2022 సెప్టెంబర్ 16న జరిగిన దారుణ సంఘటనలో ఓ వివాహిత ఆశావర్కర్‌పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను రాయితో తలపై కొట్టి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించగా, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
ఈ కేసుకు సంబంధించి గుంటూరు ఐదో అదనపు జిల్లా కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. నిందితులైన ముగ్గురికి జీవిత ఖైదు, 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ జడ్జి కె.నీలిమ మంగళవారం తీర్పు చెప్పారు. ఈ తీర్పు బాధిత కుటుంబానికి న్యాయం చేసినట్లుగా భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa