అనంతపురం ప్రజల చిరకాల కోరిక ఇప్పుడెప్పుడు నెరవేరింది. అనంతపురం నుండి కె.ఎస్.ఆర్. బెంగళూరు వరకు నడిచే మెమూ రైలు (నెం. 66560) సేవలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సేవలను అనంతపురం రైల్వే స్టేషన్‌లో ఆభిరూచిగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అంబికా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, డీఆర్ఎం శ్రీ చంద్రశేఖర్ గుప్తా, అహుడా చైర్మన్ టి.సి. వరుణ్ తదితరులు హాజరయ్యారు.
రైల్వే శాఖ చేపట్టిన ఈ కొత్త మెమూ రైలు సేవ వల్ల అనంతపురం మరియు బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ రైలు ప్రారంభంతో రోజువారీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
ఈ సందర్భంగా ఎంపీ అంబికా మాట్లాడుతూ, “ఇది అనంతపురం ప్రజల కలల రైలు. ఈ మెమూ రైలు ప్రారంభం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది,” అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa