పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చేందుకు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని బీజేపీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్ధి పీయుష్ దేశాయ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఉదయం ఆయన 25వ డివిజన్‌లోని మల్లికార్జునపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసిన నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ చంద్రబాబు తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. పాతబస్తీ అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంలో వినియోగించిన నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన స్మార్ట్ సిటీల్లో భాగమేనని తెలిపారు. తనను గెలిపిస్తే ఐదేళ్లలో నియోజకవర్గం ప్రజలు అవసరాలకు అనుగుణంగా రూపురేఖలు మారుస్తానని వాగ్ధానం చేశారు ప్రచారంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa