ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ మేనిఫెస్టో కొలిక్కి వచ్చినట్టే.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2019, 01:37 AM

గత ఐదేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు... రాబోయే ఐదేళ్లకు తీసుకునే ప్రణాళికలను జ‌త‌చేర్చి   టీడీపీ..మేనిఫెస్టో లో పొందుపరిచిన‌ట్టు స‌మాచారం. ఈ మ్యానిఫెస్టోలో ఉండబోతున్న ముఖ్య హామీలలో రైతులకు పగటిపూట 12గంటల ఉచిత విద్యుత్ అందించ‌డంతో పాటు త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే అన్నదాత సుఖీభవ పథకం వచ్చే ఐదేళ్లు పొడిగింపుకు స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చారు. అలాగే  5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తునే  స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేసేలా చూస్తామ‌ని పేర్కొన‌ట్టు తెలియ‌వ‌చ్చింది.  కేంద్రం స‌హ‌క‌రించినా, స‌హ‌క‌రించ కున్నా 2019కల్లా పోలవరం పూర్తి చేసి 40లక్షల ఎకరాలకు నీరు అందివ్వాల‌న్న‌దే ల‌క్ష్య‌మ‌ని, అలాగే ప‌ట్టిసీమ స్పూర్తిగా  పంచనదుల అనుసంధానం ద్వారా కరువు రహిత రాష్ట్రంగా చేయ‌నున్న‌ట్టు హామీ. 


అలాగే  ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న వృధ్యాప్య  పెన్షన్ వయసు 65 నుంచి 55 సంవత్సరాలకు తగ్గించ‌డం ద్వ‌రా మ‌రింత మందికి ఆస‌రా అందించాల‌న్న నిర్ణ‌యం.  మహిళలకు పసుపు-కుంకుమ పథకం ప్రతి ఏటా కొనసాగింపు,  చంద్రన్న భీమా 5లక్షల నుంచి 10లక్షలకు పొడిగింపు నిర్ణ‌యం జ‌రిగిన‌ట్టు తెలియ‌వ‌చ్చింది. అలాగే ప్రతికుటుంబానికి నెలకు క‌నీసం 15వేలు వచ్చేలా ఉపాధి క‌లిపించేందుకు చర్యలు, రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి అన్న క్యాంటీన్లు ఏర్పాటు, చంద్రన్న పెళ్లికానుక ద్వారా అన్నివర్గాలకు  50వేలు, లక్ష రూపాయలు  అంద‌జేత‌, బీసీ సబ్ ప్లాన్ చట్టానికి విధివిధానాలు రూపొందించి అమలు చేయ‌టంతో పాటు  కాపులకు ఈబిసి కోటాలో 5శాతం రిజర్వేషన్లు కల్పించిన విష‌యాన్ని గుర్తు చేస్తూ, .రానున్న ఐదేళ్లలో 6వేల కోట్లు కేటాయించే చ‌ర్య‌లు ఉంటాయ‌ని దేశం వ‌ర్గాలు చెపుతున్నాయి. 


అలాగే  రాజధానిలో నిర్మిస్తున్న అంబెడ్కర్ స్మృతివనం ను 2020కి పూర్తి చేయ‌టం, బాబు జగజ్జవన్ రామ్ స్మృతివనంను 24నెలల్లో నిర్మించ‌డం,  ఎస్సి..ఎస్టీ కమిషన్ ను రెండుగా విభజన‌,  మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు జ‌రుపుతామ‌ని దేశం మేనిఫేస్టోలో ఉండ‌నున్న‌ట్టు తెలిసింది.  ఉర్దూను రెండో అధికార భాష గా పకడ్బందీగా అమలు, దళిత క్రైస్తవులను ఎస్సిలుగా గుర్తించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం ఇప్ప‌టికే చేప‌ట్టిన‌ట్టు వివ‌రించ‌నుంది. 


గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 20లక్షల మందికి గృహ నిర్మాణాలు,  ఐటీ రంగంలో 65వేల కోట్ల పెట్టుబడులు...2.5లక్షల ఉద్యోగాల కల్పన, ఐదేళ్ళలో 15లక్షల మంది కి ఉద్యోగ కల్పనల‌తో పాటు సేవ్ డెమోక్రసి... సేవ్ కాన్సిటిట్యూషన్ పేరుతో జాతీయ విధానం తీసుకువ‌చ్చేలా  కేంద్రంతో పోరాటానికి సిద్ద‌మేన‌ని పేర్కొన‌నుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa