రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చేలా , అభివృద్ధికోసం చంద్రబాబుకు మరిన్ని ఆశీస్సులoదించాలని ప్రజలను మంత్రి నారాయణ కోరారు.శనివారం ఆయన నగరంలోని 3వ డివిజన్ లో దీన్ దయాల్ నగర్ లో కార్పొరేటర్ పొత్తూరి శైలజ ఆధ్వర్యంలో మంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ అయిదేళ్లలో నగరంలో చేసిన అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని అన్నారు. నగరంలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని చేసానని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని కోరారు. తాను ఎమ్మెల్యేను కాకపోయినా నెల్లూరు వాసిగా, మంత్రిగా నగరాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడ్డానని అన్నారు. తనను ప్రజాప్రతిధిగా ఎన్నుకుంటే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎన్నికల అనంతరం స్థానిక సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి కోరారు. పర్యటనలో మంత్రికి స్థానిక మహిళలు హారతులు పట్టి ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రితోపాటు నగర టీడీపీ ఇంచార్జ్ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, మామిడాల మధు స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa