గత కొంత కాలంగా ఫాం 7 మాటున ఓట్ల తొలగింపుకు జరుగుతున్న తంతుపై దృష్టి సారించిన ఏపీ ఎన్నికల సంఘంఓట్ల తొలగింపునకు దాఖలైన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా,వాటిలో కేవలం 1.41 శాతం దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొ లగించామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. .ఇందులో సగం నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. మిగిలిన వాటి మీద కూడా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ సందర్భంగా ఇసీ జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం - 2,579
విజయనగరం- 5,166
విశాఖపట్నం- 2,407
పశ్చిమ గోదావరి- 8,669
ప్రకాశం- 6,040
నెల్లూరు- 3,850
కడప- 5,292
కర్నూలు- 7,684
అనంతపురం- 6,516
గుంటూరు- 35,063
తూర్పుగోదావరి- 24,190
కృష్ణా- 19,774
చిత్తూరు- 14,052
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa