ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

Crime |  Suryaa Desk  | Published : Sat, Jun 14, 2025, 07:01 PM

నెల్లూరు జిల్లా సర్వేపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మల్లుగుంట సంఘం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోగా.. ఐదుమంది తీవ్రంగా గాయపడ్డారు. వెంకటాచలం మండలం పలుకూరివారిపాలెం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, రమణమ్మ, ప్రమీల మరికొంతమంది పని కోసం ఆటోలో పొట్టెంపాడుకు వెళుతున్నారు. అయితే మల్లుగుంట సంఘం వద్దకు రాగానే బైక్ అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. ఈ బైక్‌ను తప్పించబోయి ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో లక్ష్మిదేవి చనిపోగా.. మిగతావారికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa