కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆమె నిన్న ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. సోనియా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలోని గ్యాస్ట్రో విభాగంలో చేరినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.సోనియా గాంధీ ఇదే ఆసుపత్రిలో ఈ నెల 9న చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. దానికి రెండు రోజుల ముందు ఆమె సిమ్లాలోని ఇందిరా గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రి (ఐజీఎంసీ)లో చేరిన విషయం విదితమే. అధిక రక్తపోటుతో బాధపడిన సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa