పెడన మండల పరిధిలోని ఇసుకపర్ర మేజర్ డ్రైన్ మరమ్మతు పనులు మంగళవారం మొదలయ్యాయి. పుల్లపాడు పంచాయతీ పరిధిలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ వెంకట నగేష్ ప్రారంభించారు. ఈ డ్రైన్ ద్వారా వందలాది ఎకరాల్లో సాగు జరుగుతుందని, పొలాలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా తూటికాడ, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa