కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు ప్రమాదం తప్పింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం-2025 సందర్భంగా బెంగళూరులో నిర్వహించిన ఎకో-వాక్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన సైకిల్‌పై వెళ్లారు. ఈ క్రమంలో విధానసౌధకు చేరుకున్న ఆయన సైకిల్ దిగుతూ బ్యాలెన్స్ కోల్పోయారు. దీంతో DK కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆయనను పైకి లేపారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa