కదిరి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద 'తల్లికి వందనం' పథకం కింద నగదు తీసుకునేందుకు మహిళలు ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లలో వేచి ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రతి తల్లి ఖాతాలో రూ.13,000 జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ నగదును విత్‌డ్రా చేసేందుకు తపాలా కార్యాలయాలు, బ్యాంకుల వద్ద ఉదయం నుంచే భారీ రద్దీ నెలకొంది.
మహిళలు తమ ఖాతాల్లో జమ అయిన నగదును తీసుకునేందుకు గంటల తరబడి వేచి ఉంటున్నారు. కొందరు ఉదయం 5 గంటల నుంచే క్యూలో నిలబడినట్లు తెలిపారు. అయినప్పటికీ, తపాలా కార్యాలయంలో సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, సాంకేతిక సమస్యల కారణంగా నగదు విత్‌డ్రాయల్ ప్రక్రియ కాస్త ఆలస్యమవుతోందని లబ్దిదారులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, సమర్థవంతమైన ఏర్పాట్లు లేకపోవడంతో లబ్దిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక రద్దీని నియంత్రించేందుకు అదనపు కౌంటర్లు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు. అధికారులు ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, సులభంగా నగదు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa