ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సోమవారం విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం చేసి, పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం మాస్టర్ ప్లాన్, ప్రసాదం స్కీం, అభివృద్ధి పనులపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa