ఇటీవల కాలంలో శిరిడీకి వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ - నాగర్‌సోల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ స్పెషల్ ట్రైన్లు జూలై 3 నుంచి 25 వరకు రాకపోకలు సాగిస్తాయని దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. శిరిడీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. రిజర్వేషన్ ముందుగానే చేసుకోవడం మంచిదని రైల్వేశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్పెషల్ రైళ్ల వివరాలు: సికింద్రాబాద్ → నాగర్‌సోల్ స్పెషల్ (ట్రైన్ నెం. 07007): ఈ ట్రైన్ ప్రతి గురువారం రాత్రి 9:20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9:45కు నాగర్‌సోల్‌కు చేరుతుంది. నాగర్‌సోల్ → సికింద్రాబాద్ స్పెషల్ (ట్రైన్ నెం. 07002): ఇకపోతే ఈ ట్రైన్ తిరుగుముఖంలో ప్రతి శుక్రవారం నడుస్తుంది. సాయంత్రం 5:30కు నాగర్‌సోల్ నుంచి బయలుదేరి తర్వాత రోజు అంటే శనివారం ఉదయం 7:30కి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. రైళ్లు ఆగే స్టేషన్లు: మల్కాజ్‌గిరి, మేడ్చల్, బొల్లారం, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, నాందేడ్, ముద్ఖేడ్, పూర్ణ, పర్బనీ, జాల్నా, ఔరంగాబాద్అం దుబాటులో ఉండే కోచ్‌లు: ఫస్ట్ ఏసీ (ఫస్ట్ AC) సెకండ్ ఏసీ (సెకండ్AC) థర్డ్ ఏసీ (థర్డ్ AC) షిరిడీ విత్ ఎల్లోరా వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మరోవైపు షిరిడీ సాయి బాబా పుణ్యక్షేత్రమైన షిరిడి మరియు ప్రపంచ వారసత్వస సంపదల్లో ఒకటైన ఎల్లోరా గుహలు చూడాలనుకునే వారికోసం ఐఆర్‌సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్) ప్రత్యేక టూరింగ్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 3 రాత్రులు, 4 రోజుల పాటు టూర్ ప్యాకేజీకి బడ్జెట్ ధరలోనే టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.ఐఆర్‌సీటీసీ షిరిడీ-ఎల్లోరా టూర్ ప్యాకేజీ పూర్తి వివరాలు ! ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ పేరు షిరిడీ విత్ ఎల్లోరా ఏయే ప్రాంతాలు చూడవచ్చు! మహారాష్ట్రలోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలైన షిరిడీ మరియు ఎల్లోరా చూడవచ్చు. ప్యాకేజీ టారిఫ్ వివరాలు 1-3 ప్రయాణికులకు ప్యాకేటీ టారిఫ్ ధరలు కంఫర్ట్ (3A) కేటగిరీలో సింగిల్ షేరింగ్ రూ. 20640/-, డబుల్ షేరింగ్ రూ. 11420/-, ట్రిపుల్ షేరింగ్ రూ. 8880/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్‌తో కలిపి రూ. 7520/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్ లేకుండా రూ.6530/- గా నిర్ణయించారు. స్టాండర్ట్(SL) కేటగిరీలో సింగిల్ షేరింగ్‌కు రూ.19060/-,డబుల్ షేరింగ్ రూ. 9840/-, ట్రిపుల్ షేరింగ్ రూ. 7310/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్‌తో కలిపి రూ. 5940/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్ లేకుండా రూ.4950/- గా నిర్ణయించారు. 4 నుండి 6 ప్రయాణికులకు ప్యాకేటీ టారిఫ్ ధరలు కంఫర్ట్ (3A) కేటగిరీలో డబుల్ షేరింగ్ రూ. 8700/-, ట్రిపుల్ షేరింగ్ రూ. 7710/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్‌తో కలిపి రూ.7520/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్ లేకుండా రూ. 6530/- గా నిర్ణయించారు. స్టాండర్ట్(SL) కేటగిరీలో డబుల్ షేరింగ్ రూ. 7120/-, ట్రిపుల్ షేరింగ్ రూ.6130/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్‌తో కలిపి రూ. 5940/-, 5-11 ఏళ్ల చిన్నారులకు బెడ్ లేకుండా రూ.4950/- గా నిర్ణయించారు. షిరిడీ-ఎల్లోరా టూర్ ప్యాకేజీ షెడ్యూల్ప్రతి శుక్రవారం కాచిగూడ నుంచి ప్రయాణం ఉంటుంది. మొదటి రోజు శుక్రవారం హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి టూర్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలి. రాత్రి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. రెండవ రోజు శనివారం రెండవ రోజు ఉదయం 7 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుండి షిరిడీ పుణ్యక్షేత్రానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. (దర్శనం టికెట్లు ప్యాకేజీలో చేర్చబడవు) రాత్రి షిరిడీలోనే బసచేయాలి. మూడవ రోజు ఆదివారం షిరిడీ నుండి ఎల్లోరాకు బయల్దేరాలి. అక్కడకు చేరుకున్నాక, ఎల్లోరా గుహలు మరియు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన గ్రుష్ణేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవాలి.అక్కడ నుండి రాత్రి 10 గంటల 45 నిమిషాలకు రైలు ఉంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది. నాలుగవ రోజు సోమవారం నాలుగవ రోజు ఉదయం 9 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటారు. ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలో ఎస్కార్ట్ సేవలు, ట్రావెల్ ఇన్సురెన్స్ సదుపాయం ఉంటుంది. ఈ ప్యాకేజీ యెక్క పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి టూర్‌ప్యాకేజీల విభాగంలో చెక్ చేయవచ్చు. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa