డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌కు పయనమయ్యారు. పవన్ తల్లి అంజనా దేవి స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పవన్ హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈరోజు (సోమవారం) ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి కూడా వచ్చారు. కేబినెట్ సమావేశం మొదలవగానే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం అందింది. దీంతో కేబినెట్ అనుమతి తీసుకుని మరీ పవన్ హైదరాబాద్‌కు వెళ్లారు. కేబినెట్‌కు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పి పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్లారు.మరోవైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. అమరావతికి వివిధ కంపెనీల రాకకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఏడవ ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.28,546 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పరిధిలో 1450 ఎకరాల్లో మౌలికవసతుల కల్పనకు టెండర్ పిలవడానికి ఈ సమావేశంలో మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖలో దిగ్గజ ఐటి సంస్థ కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. 49వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కూడా ఆమోదం తెలుపనుంది కేబినెట్. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులను అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలుపనుంది. కొత్తగా మరో 7 అన్నాక్యాంటీన్లు ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa