కూటమి ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం గూడూరు గ్రామంలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు ఎక్స్ రే మరియు సీఆర్ యూనిట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని ఆకాంక్షతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సీ అధికారులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa