ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని మండల విద్యాశాఖ అధికారి ఎం వరప్రసాదరావు తెలిపారు. శనివారం జలుమూరు మండలం శ్రీముఖలింగం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. హెచ్ఎం ధర్మవరపు శ్రీనివాసరావు తో మాట్లాడుతూ ఈ ఏడాది మంచి ఫలితాలను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లు అందాయ లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa