ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర ఇప్పుడు దేశం మొత్తం ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదలజల్లుతోంది.ఏటా అత్యంత వైభవంగా జరిగే హిందూ పండుగల్లో ఈ జగన్నాథ రథయాత్ర ఒకటి. దీన్ని ఛారియట్ ఫెస్టివల్ లేదా శ్రీ గుండిచా యాత్ర అని కూడా పిలుస్తారు. చంద్రమాన మాసంలోని శుక్ల పక్ష ద్వితీయ తిథి రోజున జరిగే ఈ ఉత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు.. పూరీ వీధుల్లోకి వచ్చితిలకిస్తారు. ఈ జగన్నాథ రథయాత్రతో ముడిపడి ఉన్న అనేక ఆసక్తికరమైన కథలు, సంప్రదాయాల్లో జగన్నాథ స్వామి ముస్లిం భక్తుడైన సాలబేగా కథ ఒకటి. ఎన్నో తరాల నుంచి ఆదర్శంగా నిలుస్తున్న సాలబేగా.. భక్తికి మతం అడ్డుకాదని నిరూపించిన వ్యక్తి.
ఒడిశా ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం.. సాలబేగా ఆ ప్రాంతంలోని అత్యంత గౌరవనీయమైన భక్తి కవుల్లో ఒకరుగా పేరుగాంచారు. ఒక ముస్లిం కుటుంబంలో పుట్టినప్పటికీ.. తన జీవితాన్ని పూర్తిగా జగన్నాథుడిని ఆరాధించడానికి అంకితం చేశారు. ఒక మొఘల్ సుబేదార్‌కు, ఒక హిందూ బ్రాహ్మణ మహిళకు పుట్టిన సాలబేగాకు ఒకసారి దాదాపు ప్రాణాంతకమైన గాయం నుంచి దేవుడి కృపతో బయటపడ్డారు. ఆ తర్వాత సాలబేగా జగన్నాథుడికి గొప్ప భక్తుడిగా మారారు. ఒకసారి కలలో జగన్నాథుడు కనిపించి.. తన గాయాన్ని నయం చేయడంతో ఆయన తీవ్రంగా ప్రభావితం అయ్యాడు. ఆ తర్వాత తన జీవితాన్ని స్వామివారికి అంకితం చేసి.. అహే నీల శైల వంటి భజనలను రచించారు.
పురాణాల ప్రకారం.. పూరీ రథయాత్ర సమయంలో జగన్నాథుడి రథం ఒకసారి ఆగిపోయిందట. అయితే అక్కడికి సాలబేగా చేరుకునే వరకు రథం కదలలేదట. ఇప్పటికీ.. ఆ ప్రదేశంలో.. ప్రతీ సంవత్సరం స్వామివారి రథం ఆగుతుంది. ఇది సాలబేగా, జగన్నాథుడి మధ్య విడదీయరాని బంధాన్ని సూచిస్తుంది. ఆయన వారసత్వం ఒడిశా భక్తి సంస్కృతిలో నేటికీ సజీవంగా నిలిచింది. సాలబేగా రచించిన భజనలు, భక్తి గీతాలను ఒడియా భక్తులు ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. మతపరమైన సరిహద్దులను దాటిన ఆయన విశిష్ట భక్తి, ఆధ్యాత్మిక సమగ్రతకు, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి రథయాత్ర సమయంలోనూ ఆయన వారసత్వం సజీవంగా ఉంటుంది.
జగన్నాథ రథయాత్ర పురాతన సంప్రదాయాల్లో పాతుకుపోయిన పవిత్ర ఆచారాలను అనుసరిస్తుంది. ఇది రథ స్నానంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో విగ్రహాలను 108 కుండల పవిత్ర జలంతో స్నానం చేయిస్తారు. దీని తర్వాత రథ ప్రతిష్ఠ ఉంటుంది. ఇందులో కొత్తగా నిర్మించిన రథాలను పవిత్ర మంత్రాలతో ప్రతిష్ఠిస్తారు. జగన్నాథుడు, సుభద్ర దేవీ, బలభద్రుడు విగ్రహాలతో కూడిన భారీ రథాలను గుండిచా ఆలయం వైపు లాగడమే ఈ పూరీ జగన్నాథ రథయాత్ర. తిరుగు ప్రయాణాన్ని బాహుదా యాత్ర అని పిలుస్తారు. ఈ రథయాత్రలో చివరి ఆచారం నీలాద్రి విజయం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa