AP: అన్నమయ్య (D), బండార్లపల్లెలో జూన్ 28న జరిగిన ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుజ అనే యువతిని ఆమె భర్త విజయ్ శేఖర్ రెడ్డి హత్య చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. మొదట ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించినప్పటికీ.. పోలీసుల దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న నేపథ్యంలోనే భార్య ఇందుజను తన తల్లి, అక్క, అమ్మమ్మ సహకారంతో చంపినట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa